నిత్యం విభేదాలతో కొట్టుమిట్టాడే తెలుగు చలన చిత్రసీమ పైరసి విషయంలో మాత్రం ఒక్కటిగా పోరాడిందనే చెప్పాలి. నిర్మాత యలమంచి రవిచంద్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇండస్ట్రీ పెద్దలందర్ని కదిలించింది. చివరికి షూటింగ్‌లు, థియేటర్లు సైతం బంద్ చేసేందుకు ఇండస్ట్రీ ఏకగ్రీవంగా అంగీకరించింది. కానీ ఇంతలోపే ప్రభుత్వం స్పందించింది. త మిళనాడులో ఉన్న గుండా చట్టాన్ని అమలు చేస్తామని సినిమాటోగ్రఫి మంత్రి గీతారెడ్డి హామి ఇచ్చింది.
నిత్యం ప్రశాంతంగా ఉండే ఫిలించాంబర్ తాజాగా ఆందోళనకు వేదికగా మారింది. మొన్న తెలంగాణ వాదులు చాంబర్ ముందు ఆందోళనకు దిగితే, నేడు తెలుగు సినిమా పరిశ్రమ పైరసి పై ఆందోళన చేసింది. ఓ చిన్న నిర్మాత ఆమరణ నిరహార దీక్ష ఇండస్ట్రీలో కదలిక తెచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా ఇరవై నాలుగు విభాగాలకు చెందిన వారంతా ఏకమై గొంతువిప్పారు. చాలాకాలం తర్వాత ఇండస్ట్రీ ఏకతాటిపైకి వచ్చి షూటింగ్‌లు సైతం బంద్ చేయించే స్థాయికి వచ్చింది. నాలుగు రోజుల రవిచంద్ దీక్ష వెనుక అనేక విమర్శలు కూడా ఉన్నప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ కోరిక ఫలించిందనే చెప్పాలి. దీంతో దీక్ష చేపట్టిన రవిచంద్ విరమించుకోవడంతో పాటు రేపు తలపెట్టిన బంద్‌ను కూడా ఉపసంహరించుకుంది
నాలుగు రోజుల ఆమరణ నిరహార దీక్ష తర్వాత తెలుగు చిత్రసీమ సాధించిందేమిటి? తమిళనాడులో అమలు చేస్తున్న గుండా చట్టం అమలు చేసే విధంగా ప్రభుత్వం హామి ఇవ్వడమే ఇండస్ట్రీ సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. గుండా చట్టం తీసుకురావడంతో పాటు డిఎస్‌పి స్థాయి నుంచి పైరసి కేసు నమోదు చేసేందుకు ఎస్‌ఐకి అధికారం కల్పించడం మినహా ఇస్తే ప్రభుత్వం చెప్పిన హామిలో వీడియో లైసెన్సింగ్స్ పాత అంశమే. ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేయలేకపోయిందనే విమర్శలు కాస్త పక్కన పెడితే...ప్రభుత్వం పైరసీ నివారణ కోసం త్వరలో పార్లమెంట్‌లో బిల్లు కూడా పెట్టనుంది. గుండా యాక్ట్ అనేది కేవలం పైరసి చేసిన వారికే కాదు సినిమాలు కాపీ కొట్టే డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు కూడా గుండాయాక్ట్ వర్తింపచేయాల్సిందేనని సినీ దర్శకుడు తేజ అంటున్నారు.
Thursday, March 25, 2010
Subscribe to:
Posts (Atom)