Friday, April 23, 2010

సినిమా బడ్జెట్‌

సినిమా బడ్జెట్‌
తెలుగు సినిమా నిర్మాణ వ్యయం తగ్గించేందుకు నిర్మాతల మండలి సీరియస్‌గానే ప్రయత్నాలు చేస్తున్నారు. బడ్జెట్‌ తగ్గించుకునే విషయంలో సహాకరించాల్సిందిగా ఇప్పటికే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌, దర్శకుల సంఘాన్ని కోరిన నిర్మాతలు ఇరవై నాలుగు విభాగాల్లో కూడా బడ్జెట్‌ సంస్కరణలు చేపట్టనున్నారు.మరో మూడు,నాలుగు రోజుల్లో చాంబర్‌కు నివేదిక అందించున్నారు.
సినీ పరిశ్రమలో ని అన్ని విభాగాల్లో కాస్ట్‌ కటింగ్‌ కోసం నిర్మాతలు నడుం బిగించారు. కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ తగ్గించే వరకు భారీ సినిమా షూటింగ్‌లు ప్రారంభించరాదనే నిర్ణయానికి వచ్చారు.నటీనటులు, కమెడియన్ల రె మ్యూనరేషన్స్‌తో పాటు వారికి సహాయంగా ఉండే మేకప్‌, హెయిర్‌ డ్రెస్సర్స్‌, కుటుంబ సభ్యుల ఖర్చులు కూడా నిర్మాత ఎందుకు భరించాలనే అంశంపై కూడా నిర్మాతల మండలి తీవ్రంగా చర్చ జరిపింది.
ఆర్ట్‌ డైరెక్టర్లు ఇళ్లు కట్టుకోడానికే నిర్మాతలు సినిమాలు తీస్తున్నట్లుందని అన్నారో పెద్ద నిర్మాత. అంటే సినిమాకు సెట్‌ వెయ్యాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎంత డబ్బు వృధా అవుతుందో ఆ నిర్మాత మాటల్లో అర్థమవుతుంది. అవసరమైతే సెట్‌కోసం మెటిరియల్‌ను నిర్మాతల మండలియే కొనుగోలు చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. భోజనాల విషయంలో బయటి హోటళ్ల నుంచి తెప్పించుకోవడం భారం పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఇందులోకోసం అన్ని విభాగాల్లో అదనపు సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించారు.
కొందరు నటీనటులు, కమెడియన్లు ఇష్టారాజ్యంగా షూటింగ్‌కు వస్తున్న తరుణంలో ఉదయం ౯గంటల నుంచి రాత్రం ౯ గంటల వరకు కాల్షిట్‌గా పరిగణించాలని ఆలోచిస్తున్నారు. అన్ని తామే భరిస్తున్నప్పుడు కార్మికులకు బేటాలు ఎందుకు ఇవ్వాలనే అంశం కూడా చర్చకు వచ్చింది. నిర్మాతల ముందు చర్చకు వచ్చిన అంశాలన్ని అమలు జరిగితే తెలుగు సినిమాకు గోల్డన్‌ డేస్‌ వచ్చినట్లే.

Saturday, April 17, 2010

టైమ్స్ మ్యూజిక్ పై కేసు

టైమ్స్ మ్యూజిక్ సంస్థ తో పాటు రాగ.కామ్, గూగుల్.కామ్ పై హైదరాబాద్ లో కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కలెక్టర్ గారి భార్య సినిమా ప్రొడ్యూసర్ టేకుల కృపాకర్ రెడ్డి కంప్లింటే ఇవ్వడంతో జుబిలిహిల్ల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టైమ్స్ మ్యూజిక్ తో ఫిఫ్టీ ఫిఫ్టీ బిసినెస్ అగ్రిమెంట్ చేసుకునేందుకు ఇద్దరు అంగీకారానికి వచ్చిన తరువాత కృపాకర్ రెడ్డి సాంగ్స్ మాస్టర్ కాపీని డిజిటల్ కోడ్ కోసం టైమ్స్ మ్యూజిక్ కు ఇచాడు. కాని మరుసటి రోజే రాగ.కామ్ లో సాంగ్స్ ఉన్నాయ్. దీంతో కృపాకర్ రెడ్డి కాపీ రైట్ చట్టం కింద ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.