Thursday, March 17, 2011

టి.వి.ల్లో మార్పులు

తెలుగు న్యూస్ చానల్స్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ మారిపోతారో తెలియదు. ఎక్కువ జీతం వస్తుందని ఒకరు, డెస్క్ లో బాధలు భరించలేక ఇంకొకరు, ఇలా రకరకాల కారణాలతో ఈ మధ్య ఒక టి.వి. నుంచి మరో టివికి మారడం ఓ సంస్కృతిగా మారిపోతోంది. ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి లో బ్యూరో చీప్ గా పనిచేసిన మూర్తి మానేశారు. ఆ స్థానంలో రాజ్ న్యూస్ లో ఉన్న జాకీర్ చేర్యారు. టివి9 నుంచి రాజ్ న్యూస్ కు వచ్చిన జాకీర్ కొంత కాలం మాత్రమే రాజ్ న్యూస్ లో పనిచేశారు. అంతేకాదు మొన్నటివరకు ఖాలిగా ఉన్న రామచందర్ రావు ప్రత్యెక ప్రతినిధి గా ఎబిఎన్ లో చేరారు. ఇటీవలే టివి5 లో చేరిన లక్ష్మి నారాయణ మల్లి ఎన్ టి.వి. పంచాన చేరారు. న్యూస్ చానల్ లో పనిచేయడం చేతకాకనో, వినోద భరిత చానల్ లో ఊపెద్దమనో గాని స్టూడియో ఎన్ నుంచి బయటికి వచ్చిన నాగు కొద్ది రోజులు జీ తెలుగు లో చేరుతున్నట్లు తెగ ప్రచారం చేసుకున్నాడు. తమ్మారెడ్డి భరద్వాజ , లగడపాటి శ్రీధర్ లాంటి ప్రముఖులచే రికమన్ డేసన్ చేయించినా పాపం పప్పులు ఉడకలేదు. తరువాత జ్ఞానోదయం అయినట్లుంది వచ్చి మల్లి న్యూస్ చానల్ ఎ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి లో చేరాడు.

Thursday, March 10, 2011

ప్రేక్షకుల పై అలిగిన ఆర్.పి

ఒకప్పుడు తెలుగు సినిమాను తన సంగీతం తో ఏలిన ఆర్.పి.పట్నాయక్ సిని ప్రేక్షకుల పై తీవ్రంగా అలిగాడు. ఏకంగా తన బర్త్ డే (౧౦.మార్చ్)ను కూడా జరుపుకోనని తన స్నేహితులతో పాటు ఓ తనను ఇంటర్వ్యు చేసిన ఓ ప్రముఖ చానల్ ప్రతినిధి వద్ద గోడు వెళ్ళబోసుకున్నాడు. ఇంతకీ ఈ దొరవారు ఎందుకు అలిగారో తెలుసా? తాను స్వయంగా నటించి, దర్శకత్వం కూడా వహించిన బ్రోకర్ అనే సినిమాను ప్రేక్షకులు చూడలేదని అలిగాడు పాపం ఆర్.పి. సినిమా తీసిన ప్రతి దర్శకుడు తాను గొప్ప సినిమా తీశాననే అనుకుంటాడు. ఆ సినిమా గొప్పదా? కాదా? అనే విషయాన్ని ప్రక్షకులు నిర్ణయిస్తారు. బ్రోకర్ సినిమాను ఎంతమంది చూశారు అనేది పక్కన పెడితే చూసిన వారంతా సినిమా బాగుందనే చెప్పారు. అన్ని తానే చేస్తానంటే కూడా చివరికి ప్రేక్షకుడు కూడా తానే కావలసి ఉంటుందనే విషయాన్నీ ఆర్.పి. వంద్తి వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది.

మనోజ్ తో కలసి నటిస్తున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా ఈతరం హీరోలతో తెలుగు తెరను పంచుకోబోతున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఊ కొడతార - ఉలిక్కి పడతార అనే సినిమా లో బాలకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు, లక్ష్మిప్రసన్నస్వయంగా వెళ్లి బాలకృష్ణ కు కథ చెప్పి ఒప్పించారు. నూతన దర్శకుడు రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో బాలకృష్ణ నటిస్తుండటం తో పరిశ్రమలోనూ, బాలయ్య అభిమానుల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఐతే గతంలో విష్ణు నటించిన శ్రీకృష్ణార్జున సినిమాలో నాగార్జున అతిధి పాత్రలో నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది. మరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా నైన హిట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Monday, March 7, 2011

సినిమాలు లేని రాంచరణ్

సినిమాలు లేని రాంచరణ్
తెలుగు సినిమా స్టార్స్ అందరూ వరుసగా సినిమాలు చేస్తుంటే మెగాస్టార్ తనయుడు రాంచరణ్ కెరీర్ ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మగధీర హిట్ తరువాత ఆరెంజ్ లాంటి అత్తర్ ఫ్లాప్ సినిమాను చేసి ఆయన అభిమానులను, నిర్మాత, సినిమాను కొనుక్కున్న వారిని పూర్తిగా నిరాశ పరిచారు. మెరుపు సినిమా కూడా మధ్యలోనే ఆగిపోవడంతో చరణ్ కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. ఎవరితో సినిమా చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మెరుపు సినిమా ఆగిపోవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్న చరణ్ ఆచి, తూచి సినిమాలు చేసేలా కనిపిస్తున్నాడు. ఆరెంజ్ సినిమా విడుదలై ఇంతకాలం అవుతున్న ఫలానా సినిమా చేస్తున్నట్లు చరణ్ తరఫునుంచి అధికారిక ప్రకటన రాలేదు. కెరీర్ జాగ్రతగా వృద్ధి లోకి తీసుకురాడానికి ప్రస్తుతం నలుగురు దర్శకులతో చరణ్ కథ చర్చలు జరుపుతున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారనే పుకార్లు ఫిలింనగర్ లో షికార్లు చేస్తున్నాయి. వి.వి.వినాయక, త్రివిక్రమ్ శ్రీనివాస్, లారెన్స్ లతో కథ చర్చలు జరుగుతున్నాయి. మరి చరణ్ బాబు ఎవరితో సినిమా చేస్తాడో వేచి చూడాల్సిందే.

Saturday, March 5, 2011

పెళ్లి తరువాతే ప్రేమ అంటున్న ఎన్.టి.ఆర్.

పెళ్లి తరువాతే ప్రేమ అంటున్న ఎన్.టి.ఆర్.

జూనియర్ నందమూరి తారక రామారావు పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే కాబోలు పెళ్లి తరువాతే ప్రేమ అంటున్నాడట. నార్నే వారి ఏకైక పుత్రిక లక్ష్మి ప్రనతిని మే ౫న వివాహం చేసుకున్న తరువాతే ప్రేమిస్తాడట. అయితే తారక్ ప్ర్మించేది మరో అమ్మాయట. ఎలా ప్రేమించాలో డైరెక్టర్ సుకుమార్ దగ్గర నేర్చుకొమ్మని వి.వి.వినాయక తారక్ కు ఉచిత సలహా ఇచ్చాడట. అందుకే తారక్ పెళ్లి తరువాతే ప్రేమించాలని నిర్నెంచుకున్నారు. బృందావనం సినిమా చేసిన తరువాత తారక్ కు లవ్ సినిమాల పై ఆసక్తి పెరిగింది. శక్తి, రచ్చ తో పాటు బోయపాటి సినిమా పూర్తి చేసుకున్న తరువాత ఓ ప్రేమకథ చేయాలని వినాయక్ ను అడిగాడు. ప్రేమ కథలు తీయాలన్న, హీరోని లవర్ బాయ్ గా చూపించాలన్న సుకుమారే కరెక్ట్ అని వినాయక్ సలహా చెప్పడంతో సుకుమార్ తో సినిమా చేసేందుకు తారక్ ఆసక్తి చూపిస్తున్నాడని ఫిలిం నగర్ వార్త. అందుకే తారక్ పెళ్లి తరువాతే ప్రేమిస్తాడట. మరి ఈ హీరో గారిని పెళ్లి చేసుకున్నాక ఎ అమ్మాయి ప్రేమిస్తుందో వేచి చూడాల్సిందే.

జగపతిబాబు కు రోజుకు 4 లక్షలు

తెలుగు హీరోల రెమ్యునరేషన్ ఒక్కో హీరోకు ఒక్కో విధంగా ఉంటుంది. దాదాపు వంద సినిమాలు పూర్తి చేసేందుకు రెడీ ఐన జగపతిబాబు మాత్రం నాలుగు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇదంతా ఒక సినిమాకు అనుకోవద్దు. కేవలం ఒకరోజు జగపతిబాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ నాలుగు లక్షలు. ఎవరు వెళ్లి అడిగిన వెంటనే కాల్షీట్స్ ఇస్తున్నారు. అందుకే నట్టికుమార్ అనే నిర్మాత జగపతిబాబు తో వారానికో సినిమా ప్రారంభిస్తున్నారు. ఈ మధ్య జగపతిబాబు చేస్తున్న సినిమాలు ఎవరైనా చూస్తున్నారో లేదో కాని జగపతిబాబు మాత్రం ఎడా పెడా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు కావాల్సింది రోజుకు కేవలం నాలుగు లక్షల రూపాయలు. సినిమాలు జనం చూస్తే చూస్తారు. లేదంటే మానేస్తారు. ఎలాగైతేనేం వంద సినిమాలు పూర్తి చేయాలనేదే జగపతిబాబు లక్షం.

Tuesday, February 22, 2011

తెలంగాణాలో బంద్ విజయవంతం

రెండు రోజుల తెలంగాణా బంద్ తొలిరోజు విజయవంతమైంది. హైదరాబాద్ తో సహా జిల్లాల్లో వ్యాపారస్తులు, విద్యాసంస్థలు స్వచ్చందంగా తమ దుకాణాలు మూసివేశారు. రాజధాని హైదరాబాద్ లో రోడ్లన్నీ ఖాలిగా కనిపించాయి. ఆర్.టి.సి. రవాణా పూర్తిగా స్థంబించిపోయింది.ప్రభుత్వ ఉద్యోగుల సహాయనిరాకరణకు తెలంగాణా బంద్ తోడవడంతో జనజీవనం ఎక్కడికక్కడ ఆగి పోయింది. ఉస్మానియా క్యాంపస్ లో పోలీసులకు, విద్యార్థులకు మద్య రాళ్ళ వర్షం, జే.ఎ.సి. నేత కోదండరాం, టి.ఆర్.ఎస్ నేత హరీష్ రావు అరెస్టులతో నగరం దద్దరిల్లింది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చుసిన పోలీసులే కనిపించారు. ఉస్మానియా, నిజాం కాలేజీలను పోలీసులు చుట్టుముట్టి, నిజాం కాలేజీ విద్యార్థులపై భాష్ప వాయువు ప్రయోగించారు. ఈ బంద్ తెలుగుసినిమా పరిశ్రమ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమా థియేటర్లు, స్టూడియోలు, ల్యాబ్లు అన్ని స్వచ్చందంగా బంద్ పాటించారు. నలభై ఎనిమిది గంటల బంద్ లో మొదటి రోజు విజయవంతమైంది.

Thursday, February 17, 2011

తెలంగాణా చివరి ఉద్యమం

రాష్ట్రంలో ప్రత్యెక తెలంగాణా ఉద్యమం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. కెసిఆర్ దీక్షతో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారిగా ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. టి ఆర్ ఎస్ రాజకీయ సంక్షోభంలో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు, తెలంగాణా ఉద్యమాన్ని పటిష్ట పరిచే క్రమంలో కెసిఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. కెసిఆర్ దీక్షను విరమిస్తూ జ్యూస్ తగినట్లు మీడియాలో ప్రసారమైన వార్తలతో ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. అప్పటి వరకు టి ఆర్ ఎస్ చేతిలో ఉన్న ఉద్యమం విద్యార్థులు చేతుల్లోకి వచ్చేసింది. ప్రజాసంఘాలు, కవులు , కళాకారులు అన్ని వర్గాల వారు ఉద్యమంలో నడుంబిగించారు. ఈ ఉద్యమం తెలంగాణా లోని అన్ని యూనివర్సిటీలకు పాకింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో పోలీసు బలగాలు మొహరించి రక్తపాతం సృష్టించినా ఉద్యమం ఆగలేదు కదా మరింతగా పల్లెల్లో రాజుకుంది. ఓ యూ లో భారి బహిరంగ సభకు రంగం సిద్దమైంది. ఫలితంగా కేంద్రం నుంచి ప్రత్యెక రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపద్యంలో శ్రీకృష్ణ కమిటి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక తరువాత రాజకీయ పార్టీల్లో నెలకొన్న అనైక్యత తెలంగాణవాదుల్లో కోపం తెప్పించింది. ఎంతకీ పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోవడం, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నానని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పడం తెలంగాణా ప్రజలను మరింత అసహనానికి గురి చేసినట్లైంది. దీంతో ఉద్యమాన్ని ఉద్యోగులు చేతిలో తీసుకున్నారు. సహాయనిరాకరణను ప్రకటించారు. ఉద్యోగులు సహాయనిరాకరణ విజయవంతం చేస్తే , అరవై ఏళ్ళుగా ఓపిక నశించి నేతలు సహనం కోల్పోయారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే మైకు లాగడం, మీడియాతో మాట్లాడుతున్న లోకసత్త అధినేత జయప్రకాష్ నారాయణ పై జరిగిన దడితో ఉద్యమం చివరి దశకు చేరుకుందని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణా రాష్ట్రం ప్రకటించక పోతే జరిగే పరిణామాలకు అవరు బాద్యులో కేంద్రమే తేల్చుకోవలసి ఉంది .

Friday, January 21, 2011

వ్యభిచారం కేసు లో యమునా అరెస్ట్

ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన నటి యమునా బెంగళూరులో వ్యభిచారం చేస్తూ అరెస్ట్ ఐన సంఘటన సంచలనం సృష్టించింది. సాఫ్ట్ వేర్ కంపనీ సి ఇ ఓ వేణుగోపాల్ అనే వ్యక్తి తో ఓ స్టార్ హోటల్ లో ఉండగా బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. గతం లో చెన్నయ్ లో భువనేశ్వరిని కూడా వ్యభిచారం కేసు లోనే అరెస్ట్ చేసారు. ఇటీవల సైరాభాను, జ్యోతి లను కూడా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. యమునా మౌనపోరాటం సినిమా తో తెలుగు తెరకు పరిచయమైంది. పలుసినిమాల్లో నటించిన యమునా పలు సీరియల్స్ కూడా చేసింది.

Thursday, January 6, 2011

వారేం చెప్పారో వారికైనా అర్థమైందా?

గురువారం,6జనవరి2011
ఇంతకీ జస్టిస్‌ శ్రీకృష్ణ చెప్పిందేమిటి? వివాదానికి సంబంధించి జడ్జిమెంటును ఇవ్వబోతున్నానని చెప్పిన జస్టిస్‌ శ్రీకృష్ణ.. ఏం తీర్పు చెప్పారో కనీసం ఆయనకైనా అర్థమైందా? ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సమస్య ఉత్పన్నమైంది? దానికి ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వాలన్న దానిపై ఆయన స్పష్టతకు వచ్చారా? లేదా? అన్న సందేహం నివేదికలోని సిఫార్సులు పరిశీలించిన వారందరికీ వస్తుంది.. చెప్పిందే చెప్పి.. తాను చెప్పినదాన్ని తానే ఖండించి.. చివరకు ఏమీ తేల్చలేకపోయారు.
అయోమయం జగన్నాథం.. జగన్నాథుడంటే శ్రీకృష్ణుడే.. మన శ్రీకృష్ణుడే.. మన రాష్ట్రం భావి తల రాతను రాసిన శ్రీకృష్ణుడే.. జగన్నాథుడి పేరు పెట్టుకున్నందుకు ఈ కృష్ణుడు కూడా నివేదికలో అయోమయమైపోయారు.
ఏం జరుగుతుంది? రాష్ట్రాన్ని విభజిస్తారా? కలిపి ఉంచుతారా? హైదరాబాద్‌ను తెలంగాణా నుంచి చీలుస్తారా? లేదా? రాష్ట్రమంతటా ఒకటే ఉత్కంఠ.. ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయిన జనం.. ఏదో ఒక పరిష్కారం కోసం ఆశగా ఊపిరి ఉగ్గబట్టుకుని చూసిన ప్రజలంతా ఇప్పుడు బుర్రలు గోక్కుంటున్నారు..
అయోధ్య తీర్పు మాదిరిగా కర్ర విరగకుండా, పాము చావకుండా ఆరు సిఫార్సులు చేసి నొప్పింపక, తానొవ్వక శ్రీకృష్ణుడు తప్పించుకుని పోయాడు బాగానే ఉంది. కనీసం ఆ సిఫార్సుల్లో తాను చెప్పిన దానికైనా చివరకంటా కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు.. నివేదికను బుద్ధుడి సూక్తితో మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ గెలవాలి.. ఏ ఒక్కరికీ ఓటమి ఎదురుకావద్దు అన్నట్లుగానే అందరికీ కోరినవన్నీ పంచి పెట్టారు. అదే నివేదిక చివరకు వచ్చేసరికి బుద్ధుడి సూక్తిని మరిచినట్లున్నారు. ఫస్ట్‌ హోం మినిస్టర్‌ పటేల్‌జీ గుర్తుకొచ్చారు.. గ్రౌండ్‌ రియాలిటీలను మరిస్తే మాత్రం చాలా ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న అంశంపై తాము బ్యాలెన్స్‌గా వ్యవహరిస్తున్నామంటూనే తెలంగాణా ప్రత్యేక డిమాండ్‌ నిర్హేతుకం కాదని కూడా వ్యాఖ్యానించటం న్యాయమూర్తికే చెల్లింది.
అసలు శ్రీకృష్ణ కమిటీ మొత్తం ఎన్ని సిఫార్సులు చేసిందో మీకు తెలుసా? నాలుగు.. ఇదీ కృష్ణ లీలలో భాగమే.. ఒకటో సిఫారసుకు కొనసాగింపు ఆరో సిఫార్సు.. రెండో సిఫార్సుకు కొనసాగింపు నాలుగో సిఫార్సు.. ఇక మిగిలింది నాలుగే కదా..
మొదటి సిఫార్సులో రాష్ట్రాన్ని విడగొట్టొద్దన్నారు.. ఆరో సిఫార్సులో విడగొట్టకుండా తెలంగాణాకు రాజ్యాంగ పరమైన హక్కులేమివ్వాలో సూచించారు. రెండో సిఫార్సులో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నారు.. ఏయే ప్రాంతాలను కలిపి చేయాలో నాలుగో సిఫార్సులో చెప్పారు.
విచిత్రమేమంటే ఒకటో సిఫార్సులో యథాతథ స్థితిని కొనసాగించటం అసలు సాధ్యమే కాదని తేల్చి చెప్పారు.. ఆ సిఫార్సును తామే తిరస్కరించారు.. అదే ఆరో సిఫార్సు వచ్చేసరికి రాష్ట్రాన్ని ఇప్పుడున్నట్టుగా ఉంటూనే తెలంగాణాకు బోర్డులు, మండళ్లు, హక్కుల రూపంలో రాజ్యాంగ భద్రత కల్పించమన్నారు.. యథాతథ స్థితే సాధ్యం కాదన్నప్పుడు, ఇక హక్కులు కల్పించేదెలా సాధ్యపడుతుందో శ్రీకృష్ణే చెప్పాలి.
ఇక రెండో సిఫార్సు.. తెలంగాణా నుంచి హైదరాబాద్‌ను విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం.. తెలంగాణాలో ఇంటిగ్రల్‌ పార్ట్‌గా ఉన్న హైదరాబాద్‌ను కేంఅద పాలిత ప్రాంతంగా మారిస్తే తీవ్రమైన ఆందోళనలు కొనసాగుతాయని, దానికి తోడుగా మరిని కొత్త సమస్యలు వస్తాయని కాబట్టి ఇది ప్రాక్టికల్‌ కాదని తేల్చారు. అదే నాలుగో సిఫార్సు వచ్చేసరికి హైదరాబాద్‌ యూనియన్‌ టెర్రిటరీగా ఎలా చేయాలి? సరిహద్దులు ఏమిటన్నదీ విపులంగా వివరించారు.. ఒక సిఫార్సులో ఉన్నదాన్ని మరో సిఫార్సులో వాళ్లే ఖండించారు.. సూపర్‌..
తెలంగాణా ఏర్పాటు చేస్తే బాగా అభివృద్ధి చెందుతుందని, దాని జిడిపి కొన్ని రాష్ట్రాల కంటే పెరుగుతుందనీ పేర్కొన్న కమిటీయే కొన్ని లైన్లు కిందకు వచ్చేసరికి మావోయిస్టు సమస్య పెచ్చరిల్లుతుందని, సంక్షోభం రేకెత్తుతుందని పేర్కొంది. ఈ రెంటికీ పొంతన ఎలా కుదురుతుందో చిదంబరం వారే చెప్పాలి.. ఎందుకంటే మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులన్నది వారి మాటే కదా..
ఇక మూడో సిఫార్సు సంగతి.. రాయల తెలంగాణా ప్రాక్టికల్‌ కాదని భావించినప్పుడు అసలు ఆ సిఫార్సు చేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు.
ఇక మిగిలింది అయిదో సిఫార్సు.. అసలైన సిఫార్సు రెండు రాష్ట్రాలను ప్రస్తుత సరిహద్దుల ప్రకారం విడగొట్టమనటం.. చివరకు ఈ సిఫార్సుపైనైనా గట్టిగా కమిటీ నిలబడిందా అంటే అదీ లేదు.. అసలు ఇది రెండో బెస్ట్‌ ఆప్షన్‌.. అందరినీ కన్సల్ట్‌ చేసి మరీ డిసైడ్‌ చేసుకోండన్నారు.. ఇంతకీ వారేం చెప్పారో వారికైనా అర్థమైందా? ఏమో.. చిదంబరానికెరుక... this story written by my friednd santhosh kovela.

Sunday, January 2, 2011

బ్రోకర్ మంచి ప్రయత్నం * * (రివ్యు)

2010 చివర్లో వచ్చిన ఆర్.పి. పట్నాయక్ బ్రోకర్ సినిమా ఒక మంచి ప్రయత్నంగా చెప్పుకోవచు. పని చేయీన్చుకునే వాడికి, పని చేసేవాడికి మధ్యలో ఉన్న దళారి వ్యవస్థే ఈ బ్రోకర్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలుకొని ధర్మతేజ ఐ.ఏ.ఎస్ అధికారి వరకు లంచం ఇచిపుచుకోడానికి బ్రోకర్ ఎలా చేశాడో స్క్రీన్ ప్లే టెంపో బాగానే ఉంది. అవినీతి నిరోధక శాఖ లో కూడా చీడ పురుగులు ఉన్నారంటూ, బ్రోకర్ సి .ఎం కు కూడా ఎలా దగ్గరగా ఉన్నాడో బాగా చూపించాడు ఆర్పి. రైతు ఆత్మహత్యా చేసుకున్న సీన్ ఈ సినిమాకే హైలెట్. అవినీతి అధికారి నుంచి మంచి మనిషిగా మారిన శ్రీహరి పాత్రకు జేస్తిఫికేషణ్ బాగుంది. సినిమా ప్రారంభం లో వచ్చే పురుడుపోస్తే లంచం-బొడ్డు కొస్తేలంచం పాట సినిమాకు ప్రాణం పోసింది. పెన్షన్ కోసం మాస్టారు ఆత్మహత్య చేసుకొని చనిపొఇన సీన్ గుండెకు హతుకుంటుంది. గణపతి బ్రోకర్ ఇంటికి వచ్చిన మాస్టారు చెప్పిన డైలాగు మనిషి విలువలను తెలియజేస్తుంది. క్లైమాక్స్ కూడా సస్పెన్స్ గా నడిపాడు. టివి9 రవిప్రకాష్ పాత్ర లో సురేష్, జర్నలిస్ట్ హరిణి పాత్ర లో అర్చన, బ్రోకర్ గణపతి గా ఆర్పి, బ్రోకర్ భార్య గా మయూరి బాగానే నటించారు. కౌష ఐటం సాంగ్ ఓకే. ఇదే సినిమా ను శంకర్ లాంటి డైరెక్టర్ చేస్తే పెద్ద సినిమా . ఆర్పి చేశాడు కాబట్టి చిన్న సినిమా.