Tuesday, February 22, 2011

తెలంగాణాలో బంద్ విజయవంతం

రెండు రోజుల తెలంగాణా బంద్ తొలిరోజు విజయవంతమైంది. హైదరాబాద్ తో సహా జిల్లాల్లో వ్యాపారస్తులు, విద్యాసంస్థలు స్వచ్చందంగా తమ దుకాణాలు మూసివేశారు. రాజధాని హైదరాబాద్ లో రోడ్లన్నీ ఖాలిగా కనిపించాయి. ఆర్.టి.సి. రవాణా పూర్తిగా స్థంబించిపోయింది.ప్రభుత్వ ఉద్యోగుల సహాయనిరాకరణకు తెలంగాణా బంద్ తోడవడంతో జనజీవనం ఎక్కడికక్కడ ఆగి పోయింది. ఉస్మానియా క్యాంపస్ లో పోలీసులకు, విద్యార్థులకు మద్య రాళ్ళ వర్షం, జే.ఎ.సి. నేత కోదండరాం, టి.ఆర్.ఎస్ నేత హరీష్ రావు అరెస్టులతో నగరం దద్దరిల్లింది. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చుసిన పోలీసులే కనిపించారు. ఉస్మానియా, నిజాం కాలేజీలను పోలీసులు చుట్టుముట్టి, నిజాం కాలేజీ విద్యార్థులపై భాష్ప వాయువు ప్రయోగించారు. ఈ బంద్ తెలుగుసినిమా పరిశ్రమ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమా థియేటర్లు, స్టూడియోలు, ల్యాబ్లు అన్ని స్వచ్చందంగా బంద్ పాటించారు. నలభై ఎనిమిది గంటల బంద్ లో మొదటి రోజు విజయవంతమైంది.

Thursday, February 17, 2011

తెలంగాణా చివరి ఉద్యమం

రాష్ట్రంలో ప్రత్యెక తెలంగాణా ఉద్యమం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. కెసిఆర్ దీక్షతో ప్రారంభమైన ఈ ఉద్యమం దశలవారిగా ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. టి ఆర్ ఎస్ రాజకీయ సంక్షోభంలో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు, తెలంగాణా ఉద్యమాన్ని పటిష్ట పరిచే క్రమంలో కెసిఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. కెసిఆర్ దీక్షను విరమిస్తూ జ్యూస్ తగినట్లు మీడియాలో ప్రసారమైన వార్తలతో ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. అప్పటి వరకు టి ఆర్ ఎస్ చేతిలో ఉన్న ఉద్యమం విద్యార్థులు చేతుల్లోకి వచ్చేసింది. ప్రజాసంఘాలు, కవులు , కళాకారులు అన్ని వర్గాల వారు ఉద్యమంలో నడుంబిగించారు. ఈ ఉద్యమం తెలంగాణా లోని అన్ని యూనివర్సిటీలకు పాకింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో పోలీసు బలగాలు మొహరించి రక్తపాతం సృష్టించినా ఉద్యమం ఆగలేదు కదా మరింతగా పల్లెల్లో రాజుకుంది. ఓ యూ లో భారి బహిరంగ సభకు రంగం సిద్దమైంది. ఫలితంగా కేంద్రం నుంచి ప్రత్యెక రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపద్యంలో శ్రీకృష్ణ కమిటి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక తరువాత రాజకీయ పార్టీల్లో నెలకొన్న అనైక్యత తెలంగాణవాదుల్లో కోపం తెప్పించింది. ఎంతకీ పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోవడం, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నానని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పడం తెలంగాణా ప్రజలను మరింత అసహనానికి గురి చేసినట్లైంది. దీంతో ఉద్యమాన్ని ఉద్యోగులు చేతిలో తీసుకున్నారు. సహాయనిరాకరణను ప్రకటించారు. ఉద్యోగులు సహాయనిరాకరణ విజయవంతం చేస్తే , అరవై ఏళ్ళుగా ఓపిక నశించి నేతలు సహనం కోల్పోయారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే మైకు లాగడం, మీడియాతో మాట్లాడుతున్న లోకసత్త అధినేత జయప్రకాష్ నారాయణ పై జరిగిన దడితో ఉద్యమం చివరి దశకు చేరుకుందని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణా రాష్ట్రం ప్రకటించక పోతే జరిగే పరిణామాలకు అవరు బాద్యులో కేంద్రమే తేల్చుకోవలసి ఉంది .