Thursday, March 17, 2011

టి.వి.ల్లో మార్పులు

తెలుగు న్యూస్ చానల్స్లో ఎవరు ఎప్పుడు ఎక్కడ మారిపోతారో తెలియదు. ఎక్కువ జీతం వస్తుందని ఒకరు, డెస్క్ లో బాధలు భరించలేక ఇంకొకరు, ఇలా రకరకాల కారణాలతో ఈ మధ్య ఒక టి.వి. నుంచి మరో టివికి మారడం ఓ సంస్కృతిగా మారిపోతోంది. ఎ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి లో బ్యూరో చీప్ గా పనిచేసిన మూర్తి మానేశారు. ఆ స్థానంలో రాజ్ న్యూస్ లో ఉన్న జాకీర్ చేర్యారు. టివి9 నుంచి రాజ్ న్యూస్ కు వచ్చిన జాకీర్ కొంత కాలం మాత్రమే రాజ్ న్యూస్ లో పనిచేశారు. అంతేకాదు మొన్నటివరకు ఖాలిగా ఉన్న రామచందర్ రావు ప్రత్యెక ప్రతినిధి గా ఎబిఎన్ లో చేరారు. ఇటీవలే టివి5 లో చేరిన లక్ష్మి నారాయణ మల్లి ఎన్ టి.వి. పంచాన చేరారు. న్యూస్ చానల్ లో పనిచేయడం చేతకాకనో, వినోద భరిత చానల్ లో ఊపెద్దమనో గాని స్టూడియో ఎన్ నుంచి బయటికి వచ్చిన నాగు కొద్ది రోజులు జీ తెలుగు లో చేరుతున్నట్లు తెగ ప్రచారం చేసుకున్నాడు. తమ్మారెడ్డి భరద్వాజ , లగడపాటి శ్రీధర్ లాంటి ప్రముఖులచే రికమన్ డేసన్ చేయించినా పాపం పప్పులు ఉడకలేదు. తరువాత జ్ఞానోదయం అయినట్లుంది వచ్చి మల్లి న్యూస్ చానల్ ఎ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి లో చేరాడు.

Thursday, March 10, 2011

ప్రేక్షకుల పై అలిగిన ఆర్.పి

ఒకప్పుడు తెలుగు సినిమాను తన సంగీతం తో ఏలిన ఆర్.పి.పట్నాయక్ సిని ప్రేక్షకుల పై తీవ్రంగా అలిగాడు. ఏకంగా తన బర్త్ డే (౧౦.మార్చ్)ను కూడా జరుపుకోనని తన స్నేహితులతో పాటు ఓ తనను ఇంటర్వ్యు చేసిన ఓ ప్రముఖ చానల్ ప్రతినిధి వద్ద గోడు వెళ్ళబోసుకున్నాడు. ఇంతకీ ఈ దొరవారు ఎందుకు అలిగారో తెలుసా? తాను స్వయంగా నటించి, దర్శకత్వం కూడా వహించిన బ్రోకర్ అనే సినిమాను ప్రేక్షకులు చూడలేదని అలిగాడు పాపం ఆర్.పి. సినిమా తీసిన ప్రతి దర్శకుడు తాను గొప్ప సినిమా తీశాననే అనుకుంటాడు. ఆ సినిమా గొప్పదా? కాదా? అనే విషయాన్ని ప్రక్షకులు నిర్ణయిస్తారు. బ్రోకర్ సినిమాను ఎంతమంది చూశారు అనేది పక్కన పెడితే చూసిన వారంతా సినిమా బాగుందనే చెప్పారు. అన్ని తానే చేస్తానంటే కూడా చివరికి ప్రేక్షకుడు కూడా తానే కావలసి ఉంటుందనే విషయాన్నీ ఆర్.పి. వంద్తి వాళ్ళు గుర్తు పెట్టుకుంటే మంచిది.

మనోజ్ తో కలసి నటిస్తున్న బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా ఈతరం హీరోలతో తెలుగు తెరను పంచుకోబోతున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ఊ కొడతార - ఉలిక్కి పడతార అనే సినిమా లో బాలకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు, లక్ష్మిప్రసన్నస్వయంగా వెళ్లి బాలకృష్ణ కు కథ చెప్పి ఒప్పించారు. నూతన దర్శకుడు రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో బాలకృష్ణ నటిస్తుండటం తో పరిశ్రమలోనూ, బాలయ్య అభిమానుల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. ఐతే గతంలో విష్ణు నటించిన శ్రీకృష్ణార్జున సినిమాలో నాగార్జున అతిధి పాత్రలో నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది. మరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా నైన హిట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

Monday, March 7, 2011

సినిమాలు లేని రాంచరణ్

సినిమాలు లేని రాంచరణ్
తెలుగు సినిమా స్టార్స్ అందరూ వరుసగా సినిమాలు చేస్తుంటే మెగాస్టార్ తనయుడు రాంచరణ్ కెరీర్ ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మగధీర హిట్ తరువాత ఆరెంజ్ లాంటి అత్తర్ ఫ్లాప్ సినిమాను చేసి ఆయన అభిమానులను, నిర్మాత, సినిమాను కొనుక్కున్న వారిని పూర్తిగా నిరాశ పరిచారు. మెరుపు సినిమా కూడా మధ్యలోనే ఆగిపోవడంతో చరణ్ కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. ఎవరితో సినిమా చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మెరుపు సినిమా ఆగిపోవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్న చరణ్ ఆచి, తూచి సినిమాలు చేసేలా కనిపిస్తున్నాడు. ఆరెంజ్ సినిమా విడుదలై ఇంతకాలం అవుతున్న ఫలానా సినిమా చేస్తున్నట్లు చరణ్ తరఫునుంచి అధికారిక ప్రకటన రాలేదు. కెరీర్ జాగ్రతగా వృద్ధి లోకి తీసుకురాడానికి ప్రస్తుతం నలుగురు దర్శకులతో చరణ్ కథ చర్చలు జరుపుతున్నారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారనే పుకార్లు ఫిలింనగర్ లో షికార్లు చేస్తున్నాయి. వి.వి.వినాయక, త్రివిక్రమ్ శ్రీనివాస్, లారెన్స్ లతో కథ చర్చలు జరుగుతున్నాయి. మరి చరణ్ బాబు ఎవరితో సినిమా చేస్తాడో వేచి చూడాల్సిందే.

Saturday, March 5, 2011

పెళ్లి తరువాతే ప్రేమ అంటున్న ఎన్.టి.ఆర్.

పెళ్లి తరువాతే ప్రేమ అంటున్న ఎన్.టి.ఆర్.

జూనియర్ నందమూరి తారక రామారావు పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే కాబోలు పెళ్లి తరువాతే ప్రేమ అంటున్నాడట. నార్నే వారి ఏకైక పుత్రిక లక్ష్మి ప్రనతిని మే ౫న వివాహం చేసుకున్న తరువాతే ప్రేమిస్తాడట. అయితే తారక్ ప్ర్మించేది మరో అమ్మాయట. ఎలా ప్రేమించాలో డైరెక్టర్ సుకుమార్ దగ్గర నేర్చుకొమ్మని వి.వి.వినాయక తారక్ కు ఉచిత సలహా ఇచ్చాడట. అందుకే తారక్ పెళ్లి తరువాతే ప్రేమించాలని నిర్నెంచుకున్నారు. బృందావనం సినిమా చేసిన తరువాత తారక్ కు లవ్ సినిమాల పై ఆసక్తి పెరిగింది. శక్తి, రచ్చ తో పాటు బోయపాటి సినిమా పూర్తి చేసుకున్న తరువాత ఓ ప్రేమకథ చేయాలని వినాయక్ ను అడిగాడు. ప్రేమ కథలు తీయాలన్న, హీరోని లవర్ బాయ్ గా చూపించాలన్న సుకుమారే కరెక్ట్ అని వినాయక్ సలహా చెప్పడంతో సుకుమార్ తో సినిమా చేసేందుకు తారక్ ఆసక్తి చూపిస్తున్నాడని ఫిలిం నగర్ వార్త. అందుకే తారక్ పెళ్లి తరువాతే ప్రేమిస్తాడట. మరి ఈ హీరో గారిని పెళ్లి చేసుకున్నాక ఎ అమ్మాయి ప్రేమిస్తుందో వేచి చూడాల్సిందే.

జగపతిబాబు కు రోజుకు 4 లక్షలు

తెలుగు హీరోల రెమ్యునరేషన్ ఒక్కో హీరోకు ఒక్కో విధంగా ఉంటుంది. దాదాపు వంద సినిమాలు పూర్తి చేసేందుకు రెడీ ఐన జగపతిబాబు మాత్రం నాలుగు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇదంతా ఒక సినిమాకు అనుకోవద్దు. కేవలం ఒకరోజు జగపతిబాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ నాలుగు లక్షలు. ఎవరు వెళ్లి అడిగిన వెంటనే కాల్షీట్స్ ఇస్తున్నారు. అందుకే నట్టికుమార్ అనే నిర్మాత జగపతిబాబు తో వారానికో సినిమా ప్రారంభిస్తున్నారు. ఈ మధ్య జగపతిబాబు చేస్తున్న సినిమాలు ఎవరైనా చూస్తున్నారో లేదో కాని జగపతిబాబు మాత్రం ఎడా పెడా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు కావాల్సింది రోజుకు కేవలం నాలుగు లక్షల రూపాయలు. సినిమాలు జనం చూస్తే చూస్తారు. లేదంటే మానేస్తారు. ఎలాగైతేనేం వంద సినిమాలు పూర్తి చేయాలనేదే జగపతిబాబు లక్షం.